అద్భుత వ్యూహం మిమ్మల్ని చరిత్రలో అత్యంత రక్తపాత శతాబ్దమైన 20వ శతాబ్దానికి మిమ్మల్ని తీసుకెళుతుంది. అధికారం మరియు ప్రాబల్యం కోసం పోరాడిన నిజమైన దేశాలకు నేతృత్వం వహించండి. మీ యుద్ధ కుశలత మరియు వ్యూహాత్మక నైపుణ్యాలు ప్రదర్శించండి, భీకరమైన యుద్ధాల్లో శత్రువులతో పోరాడండి. ఆర్థిక అద్భుతాన్ని సృష్టించి, మీ దేశాన్ని సమృద్ధి దిశగా నడిపించండి. పేరు వింటేనే గడగడలాడే వణికిపోయే తిరుగులేని ఆర్మీని నిర్మించండి. నాయకత్వ ప్రపంచంలో, ఒక్కరు మాత్రమే అగ్రగామిగా ఉండగలరు!
గొప్ప చక్రవర్తి, తెలివైన రాజు లేదా ప్రియాతిప్రియమైన అధ్యక్షుడు అవ్వండి. యుద్ధాలు, వెన్నుపోట్లు, గూఢచర్యం, ఒప్పందాలు మరియు సంధి చేసుకోవడాలు - ఇవన్నీ మీ ముందున్న పనులతో పోలిస్తే చాలా చిన్నవే. మీ సింహాసనం మీ కోసం ఎదురు చూస్తోంది!
భయంకరమైన నియంతగా లేదా గొప్ప శాంతిదూతగా 20వ శతాబ్దపు సరికొత్త చరిత్రను తిరిగిరాయండి.
గేమ్ ఫీచర్‌లు:
✪ గొప్ప సామ్రాజ్యాలు మరియు దేశాలతో 20వ శతాబ్దపు ప్రారంభ వాతావరణం
✪ వలసరాజ్యస్థాపన: మ్యాప్‌లోని ఖాళీ ప్రదేశాలను నింపండి మరియు కొత్త భూములు అన్వేషించండి
✪ ఇతర దేశాలపై యుద్ధాలను ప్రకటించండి, ఎవరైనా కోరితే మిలటరీ క్యాంపైన్‌ల్లో పాల్పంచుకోండి
✪ వేగవంతమైన, అద్భుత యుద్ధాలు: శత్రువు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయండి లేదా తెల్ల జెండా ఎగురవేయండి
✪ నానారాజ్య సమితి: తీర్మానాలను ప్రతిపాదించండి, ఇతర తీర్మానాలపై ఓటువేయండి, ఓట్లు వేయడానికి లంచాలు ఇవ్వండి
✪ అర్థం చేసుకోగల యంత్రాంగాలు: ఎకానమీ, మిలటరీ మరియు రాజకీయాలు
✪ పరిపాలించడానికి 60 కంటే ఎక్కువ దేశాలు
✪ భూమి, సముద్రం మరియు ఆకాశంలో అద్భుతమైన పోరాటాలు
✪ ఆధునిక యుగ మిలటరీ: ట్యాంక్‌లు, బాంబర్లు, సబ్‌మెరైన్‌లు, యుద్ధనౌకలు, ఆర్టిలరీ మరియు పదాతిదళం
✪ మీ మతం మరియు భావజాలాన్ని ఎంచుకోండి
✪ వ్యాపారం చేయండి మరియు ట్యాక్స్‌లు వసూలు చేయండి
✪ సరికొత్త భావి పరిశోధనలు మరియు టెక్నాలజీలను తెలుసుకోండి
వివిధ రకాలైన వ్యూహాలు, చర్యకు ఉపక్రమించే స్వేచ్ఛ మీ కోసం ఎదురు చూస్తున్నాయి. గౌరవం మరియు గొప్పతనం కోసం పోరాడండి! మీ దేశానికి నిజమైన నాయకుడు అవ్వండి!
గేమ్ ఈ క్రింది భాషలలో స్థానీకరించబడింది: ఇంగ్లీష్, స్పానిష్, ఉక్రేనియన్, పోర్చుగీస్, ఫ్రెంచ్, చైనీస్, రష్యన్, టర్కిష్, పోలిష్, జర్మన్, అరబిక్, ఇటాలియన్, జపనీస్, ఇండోనేషియన్, కొరియన్, వియత్నామీస్, థాయ్.
అప్‌డేట్ అయినది
3 అక్టో, 2025